హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యుటన్ కాంతి మరియు ఖగోళ పరిశోధనలవైపు తీవ్రంగా కృషిచెయ్యడానికి ప్రేరేపించిన అంశాలేమిటి.
పరిశోధనలద్వారా అతను సాధిచిన విజయాలేమిటి మొదలైన విషయాలు తెలుసుకుందాం.
కెప్లర్, కోపర్నికస్ మాత్రమేకాకుండా న్యుటన్ ను తీవరంగా ప్రభావితం చేసిన మరొక శాస్త్రవేత్త గెలిలియో. గెలిలియో ఇటలీకి చెందిన తత్వవేత్త, ఖగోళ పరిశోధకుడు.
ఈయన తన సొంతంగా ఒక ఆధునిక దూరదర్శినిని తయారుచేసుకున్నాడు.
అప్పటివరకూ ఉన్న దూరదర్శినిలు కేవలం కొద్ది దూరం చూడడానికి మాత్రమే ఉపయోగపడేవి.
కానీ గెలీలియో అప్పటివరకూ ఉన్న దూరదర్శినికి మెరుగులు దిద్దాడు. ఈ దూరదర్శినితో ఖగోళాన్ని కూడా దర్శించవచ్చు.
దానిద్వారా ఈ విశ్వాన్ని చూసిన గెలీలియో కి అక్కడి వస్తువులని మరింత స్పష్టంగా చూడగలిగాడు.
సంపూర్ణ గోళం అనుకున్న చంద్రుడిమీద అతనికి కొండలు లోయలు కనిపించాయి.
ఏమచ్చ లేదని భావించబడే సూర్యునిపై అతనికి వివిధ వాయువులు మండడం వల్ల ఏర్పడే మచ్చలు కనిపించాయి.
సూర్యుడు కూడా ఈ విశ్వంలోని అనేక తారలవలే ఒక తార అని తెలుసుకున్నాడు.
కానీ ఈ అనంతవిశ్వం మొత్తం దైవ సృష్టి అని, దానిని ప్రశ్నించే లేదా తిరస్కరించే ప్రతిపాదనలు దైవద్రోహంగా పరిగణించే సమాజంలో తన పరిశోధనలు బైటపెడితే తన ప్రాణానికే ప్రమాదం అని భావించి, తన పరిశోధన ఫలితాలను మార్మిక భాషలో రాసుకున్నాడు గెలిలియో.
ఈ పరిశోధన ఫలితాలు తరువాతితరం పరిశోధకులకి గొప్ప వారసత్వ సంపదగా లభించాయి.
ప్రయోగంద్వారా విషయ నిర్ధారణకి వచ్చే విధానానికి గెలీలియో ఆద్యుడు. ఈ పద్ధతి న్యూటన్ ని విశేషంగా ఆకట్టుకుంది.
గెలీలియో ఖగోళ పరిశోధనలు చెయ్యడమే కాదు, అరిస్టాటిల్ ప్రవచించిన వస్తు చలన సిద్ధాంతంలో కూడా లోపాలను సరిచేశాడు.
అరిస్టాటిల్, ఒక వస్తువు, కదలకుడా ఉండే నిశ్చల స్థితినే దాని సహజ స్థితి అన్నాడు.
గెలీలియో దానికి సవరణ చేస్తూ, ఒక మార్పులేని వేగంతో ఒక స్థిరమైన మార్గంలో ప్రయాణించే స్థితి కూడా దాని సహజస్థితి గా చెప్పాడు.
ఎందుకంటే ఏబాహ్యబలం లేకుండా ఈ రెండు స్థితులలోంచి వస్తువుని మరొక స్థితిలోకి మార్చలేము.
ఒక రాయినో బంతినో గాలిలోకి విసిరామనుకోండి, దానిపై గాలి నిరోధం , భూమి ఆకర్షణల వల్ల అది తిరిగి భూమి పై పడిపోతుంది.
లేకపోతే అది అలాగే ఆకాశంలోకి నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది.
ఈ సూత్రం ఆధారంగానే గ్రహాలు పడిపోకుండా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు.
*********************************************************
అలాగే అరిస్టాటిల్ చెప్పిన మరొక సూత్రాన్ని కూడా తప్పని నిరూపించాడు గెలిలియో.
వేరు వేరు బరువులుండే రెండు వస్తువులను ఒకేసారి ఎత్తునుండీ క్రిందకు పడేస్తే, వాటిలో ఎక్కువ బరువున్న వస్తువు ముందు నేలను తాకుతుందని చెప్పాడు అరిస్టాటిల్.
దానిని తప్పని నిరూపించడానికి, ఇటలీలోని పీసా సౌధం ఎక్కి రెండు వేరువేరు ద్రవ్యరాసులుండే ఇనుపగుండ్లను నేలపై పడేశాడు.
ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఆరెండు గుండ్లు ఒకేశారి నేలను తాకాయి.
అరిస్టాటిల్ సిద్ధాంతానికి కారణం బహుశా ఆయన ఒక ఇనుపవస్తువును, ఒక ఈకలాంటి వస్తువును పాడవేసి ఉండవచ్చు.
ఈకలాంటి వస్తువు పై గాలినిరోధం ఎక్కువగా ఉంటుంది. కనుక అది లేటుగా నేలను తాకుతుంది.
అదే గాలిని తొలగించిన, గురుత్వాకర్షణ శక్రి మాత్రమే పనిచేసే ఒక శూన్యమందిరంలో ఇదే ప్రయోగాన్ని చేస్తే, ఈక, ఇనుపగుండు కూడా ఒకేసారి నేలను తాకుతాయి.
గెలీలియో తోపాటు క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దానికి చెందిన గ్రీకు తాత్వికుడు డెమాక్రిటస్ చెప్పిన మరొక సిద్ధాంతం కూడా న్యుటన్ ని బాగా ఆకట్టుకుంది.
డెమాక్రిటస్ ఈ విశ్వంలోని ప్రతివస్తువూ అణువులతో నిర్మితమైందే అని చెప్పాడు. ఈ అణువులను అతడు యాటం అని పిలిచాడు.
ఈ భావనే తరువాతి రోజులలో కాంతి అనే కణాల సమ్మేళనం అనే న్యూటన్ సిద్ధాంతానికి భూమిక అయిఉండవచ్చు.
ఈవిధంగా తనముందు తరాలకు చెందిన పరిశోధకులు వెలువరించిన అభిప్రాయాలు, చేసిన పరిశోధలు న్యూటన్ని ఆకర్షిస్తూ ఉనండేవి.
వారి పరిశోధనలలో తనకు కనిపించేలోపాలు, విజ్గాన శాస్త్ర పరిశోధనలవైపు తనను రెచ్చగొడుతూ ఉండేవి.
******************************************************************
ఒక రాత్రి, అంటే 1664 లో డిసెంబర్ నెలలో తెల్లవారుఝామున 4:30 గంటలకి న్యూటనుకి ఆకాశంలో ఒక తోక చుక్క కనిపించింది.
ఆకాశలో అతవేగంగా కదులుతున్న వస్తువు లక్షణాలేంటి అని న్యూటన్ అలోచించాడు. దానిగురించి తననోటు పుస్తకంలో రేఖాచిత్రం ద్వారా వర్ణించాడు.
న్యుటన్ ఏమిచేసిన పూర్తి అంకితభావంతో చేసేవాడు. ఒక విషయాన్ని నేర్చుకునే క్రమంలో మనసా,వాచా,కర్మేణా కృషిచేసి దాని అంతుచూసేదాకా వదిలేవాడుకాదు.
ఒకసారి న్యుటనుకి జ్యోతిషశాస్త్రానికి సంబంధించిన పుస్తకం దొరికింది. నిజానికి ఒక సైన్సు సాధకునిగా జ్యోతిషానికి అతనికి సరిపడదు.
కానీ న్యూటన్ దాన్ని చదివాడు.
అందులో వివిధ గ్రహాలగురించిన, గ్రహగతులగురించిన వివరణ ఉంది. దానిని అర్ధంచేసుకోవాలంటే త్రికోణమితిపై అవగాహన అవసరం.
త్రికోణమితి రావాలంటే జామెట్రీ పై అవగాహన అవసరం.
దానితో న్యూటన్ త్రికోణమితి,జామెట్రీ పుస్తకాలను తెచ్చికుని వాటిని మధించేవాడు.
ఆవిధంగా న్యూటన్ తనకు సంబంధంలేని విషయాలను చదువుతూ కూడా విజ్ఞాన శాస్త్రంవైపు కదిలాడు.
న్యూటన్ అంటే ట్రినిటీలోని ప్రొఫెసర్లకు కూడా ఎంతో అభిమానంగా ఉండేది.
తను చదువున్న బియ్యే కోర్సులో అతనే ప్రధముడిగా వస్తాడని అందరూ నమ్మేవారు.
కానీ 1665లో జరిగిన ఆ పరీక్షలలో అందరినీ ఆశ్చర్య పరుస్తూ న్యూటన్ రెండవ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు.
దానికి కారణం, ఆరోజుల్లో ట్రినిటీ కాలేజ్ లో ఉండే పరీక్షా విధామే.
అప్పట్లో ఉత్తీర్ణతను నిర్ణయించే పద్ధతి ఎక్కువగా వాదం,తర్కాలమీదే ఆధారపడి ఉండేది. కానీ న్యూటన్ పధతి ఎక్కువగా ప్రయోగాలు వాటినిరూపణల దారిలో ఉండేది.
బియ్యే పూర్తి అయిన తరువాత న్యూటన్ ట్రినిటీ లోనే ఏమ్మే చేద్దాం అనుకున్నాడు. కానీ అనుకోని ఆపద ఎదురయ్యింది. 1665లో లండను మాహానగరంలో ప్లేగువ్యాధి విజ్రంభించింది.
దానిధాటికి లక్షల మంది మరణించారు. లండనులో సగం ఖాళీ ఆయే పరిస్థితి. దాంతో ట్రినిటీ కాలేజ్ అధికారులు కొంతకాలం కాలేజ్ ని మూసివేశారు, తప్పనొసరి పరిస్థితిలో న్యూటన్ వూల్ఫ్-థార్ప్ చేరుకున్నాడు.
తరువాతి రోజులలో న్యూటన్ కాంతిపై తన దృష్టిని కేంద్రీకరించాడు. వర్షాలు పడినప్పుడు స్యూరునికి ఎదురుగా ఆకాశంలో ఏర్పడే ఇంద్రధనుస్సు అతనిని అలోచింపచేసేది.
*******************************************************************
తప్పనిసరి పరిస్థితుల్లో తన ఊరికి చేరిన న్యూటన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించాడు.
అప్పటికే భౌతికశాస్త్ర సిద్ధాంతాలను వివరించడానికి గణితశాస్త్రం ఎంత శక్తివంతంగా ఉపయోగపడుతుందో అతనికి అవగాహన ఉంది.
అప్పటికే త్రికోణమితి,జ్యామితి నేర్చుకునే క్రమంలో విలియమ్ ఆట్రెడ్ రాసిన కీ టు మాథమెటిక్స్ అనే పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివాడు.
అది కాక ప్రఖ్యాత ఫ్రెంచ్ తాత్వికుడు, గణితవేత్త అయిన ‘రేనే దే కార్త్’ (Rene des Cartes) విశ్లేషణాత్మక జ్యామితి (analytical geometry) మీద చేసిన రచనలు కూడా చదివాడు.
అయితే వారు వ్యకతపరిచిన భావనలలో గణితశాస్త్ర శక్తిని పూర్తిగా వినియోగించుకోలేదని, వారి భావనలు అన్ని సార్లూ విస్వజనీయం కాదని అనిపించింది న్యూటన్ కి.
అప్పటికి అందుబాటులో ఉన్న త్రికోణమితి, జ్యామితి ల ద్వారా కొన్ని స్థిరమైన వస్తువులకు సంబంధించిన విషయాలను విశదీకరించవచ్చు.
కానీ అత్యంత వేగంతో కూడిన చలనరాశులైన గ్రహాల గురించి చెప్పేడప్పుదు అప్పటికి అందుబాటులో ఉన్న గణితశాస్త్ర శక్తి సరిపోదనిపించింది.
ఇలా సరికొత్త అలోచనలతో కొత్తకొత్త గణితశాస్త్ర ఆవిష్కరణలకోసం న్యూటన్ కృషి మొదలుపెట్టాడు.
1666 సంవత్సరం చివరినాటికి ఈ విభాగంలో 4 పరిశోధన పత్రాలు సమర్పించాడు.
ఈ సరికొత్త గణిత భావనలకి ఫల్క్-షన్ అని పేరు పెట్టాడు.
ఈ సరికొత్త గణిత శాస్త్రం ఉపయోగించి, గమనంలో ఉన్న వస్తువుల వేగం, దూరం వంటి విషయాలను సమర్ధవంతంగా వ్యక్త పరచవచ్చు.
తదనంతరకాలంలో ఇదే మనం ఈరొజు కాల్కులస్ అని పిలుచుకునే గొప్ప గణిత విభాగంగా మారిపోయింది.
తదనంతరకాలంలో అనేకమంది పరిశోధకులు మేధావులు కాలికులస్ విభాగంలో అద్భుతమైన కృషిచేశారు.
వారిపరిశోధనలఫలితంగా, భౌతికశాస్త్ర భావనలను మరింత శక్తివంతంగా వ్యక్తపరచడం కుదిరింది.

0 Comments