హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూటన్ కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇంతకుముందు వీడీయో లో మనం న్యూటంచేసిన  ప్రయోగం ద్వారా కాంతి గాలిలాంటి  ఒక యానకం నుండీ స్పెక్ట్రం లాంటి మరొక యానకం లోకి ప్రవేసించినపుడు వక్రీభవనం చెంది, వివిధ రంగులుగా విడిపోతుందని తెలుసుకున్నాం కదా, 

అయితే కాంతి గాలిలోంచి  స్పెక్టంలోనికి ప్రవేశించినప్పుడు  అది పలు రంగులుగా విడిపోతుందని మొదట గుర్తించినది న్యూటన్ కాదు. అంతకు ముందే రెనె దెకార్తె  లాంటి శాస్త్రజ్ఞులు ఆ విషయాన్ని గురించి చర్చించారు. కానీ అలా ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని మాత్రం ఎవ్వరూ పెద్దగా వివరించలేకపోయారు. 

న్యూటన్ పరిశోధన ద్వారా దాన్ని ప్రయోగపూర్వకంగా వివరించగలిగాడు.కాంతి అనేది కంటికి కనిపించని అతి చిన్న కణాల సమూహం. కాంతి గాలి లోంచి, స్పెక్ట్రం లాంటి మరొక పదార్ధంలోనికి ప్రవేశించినప్పుడు,  స్పెక్ట్రం  అంచువద్ద కొద్దిగా వంగుతుంది. 

ఈ వంపు అనేది, ఆ కాంతీలోని కణాల ద్రవ్యరాశులలో తేడావల్ల కొన్ని కాంతులు ఎక్కువ వంగితే కొన్ని తక్కువ వంగుతాయి.

ఎర్రని కాంతిలో ఉండే కణాలు ద్రవ్యరాశి ఎక్కువగా ఉండడంవల్ల  తక్కువగా వంగితే వైలెట్ కణాలు తక్కువ ద్రవ్యరాశి ఉండడంవల్ల ఎక్కువగా వంగుతాయి. తెల్లని కాంతి అనేది ఏడు రంగుల మిశ్రమం. అందువల్ల స్పెక్ట్రంలోనికి ప్రవేశించిన వెంటనే కాంతి ఏడురంగులుగా విడిపోతుంది. ఈ విధంగా న్యూటన్ కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా వివరించ గలిగాడు.


 న్యూటన్  వూల్ఫ్-ధార్ప్ లో ఉండవలసివచ్చిన రోజులను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతమైన కాంతి కణ సిద్ధాంతాన్ని అత్యంత సులభమైన వివరణలతో నిరూపించగలిగాడు. 

లండన్లో ప్లేగువ్యాధి తగ్గుముఖం పట్టాకా న్యూటన్ మళ్ళీ ట్రినిటీ కి వచ్చి తన ఎమ్మ్.ఏ  1667 లో పూర్తిచేశాడు. స్వతహాహా మేధావి కావడంతో ట్రినిటీలో ఫెలోషిప్ కూడాదొరికింది. న్యూటంకి ట్రినిటీ కాలేజ్లో ప్రొఫెసర్ బారో వద్ద శిష్యరికం చేసే అవకాశం వచ్చింది. ప్రొఫెసర్ బారో గొప్ప గణితవేత్త,కాంతిపై కూడ కొన్ని ప్రయోగాలు చేశాడు.  ఆయన కాంతిపై రాసిన పుస్తకానికి న్యూటన్ సంపాదకీయం వహించాడు.

81--

****************************************************

బారోకి న్యూటన్ మేధస్సుమీద అపారమైన గురి కుదిరింది . ప్రొఫెసర్ బారో యూరోప్ లోని ఎంతోమంది మేధవులకు, శాస్త్రవేత్తలకు న్యూటన్ ని పరిచయంచేశాడు. బారోకి గణితము, సైన్స్ లలో మాత్రమేకాక మతవిద్యలోకూడ ప్రవేశముంది. దానితో, ఇంగ్లండు రాచ కొలువులో  మతాధికారిగా  ఉద్యోగం రావడంతో ఎగిరిగంతేసి వెళ్ళిపోయాడు. 

వెళ్తూ వెళ్తూ న్యూటన్ని తన తరువాతి ప్రొఫెసర్ స్థానానికి సిఫారసు చేసి వెళ్ళిపోయాడు. బారో సిఫారసుతో పాటు, అప్పటికే న్యూటన్ ప్రతిభ లోకం  గుర్తించడంతో సులభంగానే ప్రొఫెసర్ పదవి ఆయనకి దక్కింది. 

ఆ విధంగా అక్టోబర్ 29, 1669  లో కేంబ్రిడ్జ్ లో న్యూటన్ గణిత ప్రొఫెసర్ గా నియామకం అయ్యాడు. ట్రినిటీ కాలేజ్ చరిత్రలో  అంత చిన్న వయసులో ప్రొఫెసర్ స్థానానికి చేరుకున్నది న్యూటన్ మాత్రమే.

ప్రొఫెసర్ గా తన విధులు నిర్వర్తిస్తూనే కాంతిమీద గణితం మీదా తన పరిశోధనలు కొనసాగించాడు న్యూటన్.  అప్పుడే న్యూటన్ టెలిస్కోప్ నిర్మాణానికి పూనుకున్నాడు. అప్పటికే ఎన్నో టెలిస్కోపులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ఉన్న లోపాలను సరిచేస్తూ సరికొత్త టెలిస్కోప్ ను తయారు చెయ్యాలన్నది న్యూటన్ సంకల్పం. 

అప్పటికి అందుబాటులో ఉన్న టెలిస్కోపులలో కాన్వెక్స్ లెన్స్ అంటే కుంభాకార అద్దాలను వాడెవారు, కానీ వాటిల్లో చిత్రం అలుక్కుపోయినట్లు కనిపించేది. దానికికారణం. స్పెక్ట్రంపై పడ్డ కాంతి వివిధకోణాల్లో వక్రీభవనం చెందడమే.

ఆ లోపాన్ని సవరిస్తూ న్యూటన్ కాంకేవ్ లెన్స్ అంటే లోపలికి వంపు తిరిగి ఉండే అద్దాలను వాడాడు. కాంతి ఈ దూరదర్శినిలో  లెన్సు  పై పడి యుటర్న్ తీసుకుని తిరిగి అద్దం వంటి వస్తువుపై పడుతుంది.

 అయితే నిజానికి అది అద్దం కాదు, కొన్ని రకాల లోహాలను చాలాసేపు గరుకైన వస్తువుతో రుద్దితే ఆ లోహపు ఉపరితలం అద్దం లా తయారవుతుంది. 

తగరము, రాగి కలిసిన ఓ మిశ్రలోహాన్ని దీనికోసం వాడుకున్నాడు న్యూటన్.దానిపైపడిన  కాంతి రెఫ్లెక్ట్ అయ్యి వస్తువు చాలా స్పస్టంగా కనిపిస్తుంది.   దానితో లోపం సరయ్యింది. దానిని న్యూటన్ రిఫ్లక్షన్ టెలిస్కొప్ అన్నాడు.

ఒక మిత్రునికి ఉత్తరం రాస్తూ న్యూటన్, తాను తయారు చేసిన దూరదర్సిని ద్వారా వస్తువులను 40 రెట్లు పెద్దదిగా చూడగలుగుతున్నానని, తనకు జూపిటర్, దాని ఉపగ్రహాలు స్పస్టంగా కనిపిస్తున్నాయని చెప్పాడు. 

తాను తయారుచేసిన టెలిస్కోప్ని రాయల్ సొసైటీ లో ప్రదర్శనకి పెట్టినప్పుడు, సభ్యులందరూ సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఆ కార్యక్రమానికి రాజు చార్లెస్ కూడా హాజరయ్యాడు. న్యూటన్ పరిశొధనల పత్రాన్ని రాయల్ సొసైటీకి సమర్పించాడు. దానితో యూరోప్ అంతా ఆయనపేరు మారుమోగిపోయింది.

అయితే రాయల్ సొసైటీలో గుర్తింపుతోపాటు న్యూటంకి అక్కడ ప్రతర్ధులు కూడ వచ్చారు. వారు న్యూటన్ చేసిన ప్రయోగాలపై ప్రశ్నలు సంధించేవారు. వారిలో ముఖ్యుడు రాబర్ట్ హూక్.  ఆయన కూడ కాంతి మీద ప్రయోగాలు చేశాడు. ఈయనకూడా సొంతంగా దూరదర్శినిని, ఇంకా ఒక స్మూక్షదర్శినిని అంటే మైక్రోస్కోప్ కూడా తయారు చేశాడు. దానిని ఉపయోగించి స్మూక్ష్మజివులపై  పరిసోధనలు చేశాడు. "Micrographia " అనే పుస్తకాన్ని కూడారాశాడు.

80--

********************************************************

రాబర్ట్ హూక్ కాంతి తరంగం అని భావించేవాడు, కానీ న్యూటన్ కణం అంటున్నాడు.  దానిని నిరూపించమని కోరుతూ హూక్, న్యూటన్ తో వాదించేవాడు. 

కానీ న్యూటన్ పద్ధతి కొంచెం విచిత్రమైనది. తాను ఎంతో పరిశోధనచేసి కాంతి కణాల సమూహం అన్న విషయాన్ని కనుగొన్నానని, మళ్ళి దానిని నిరూపించవలసిన అవసరం లేదని  భావించేవాడు. సత్తావుంటే, తాను చెప్పిన విధంగా ప్రయోగాన్ని చేసి ఫలితాన్ని నిర్ధారించుకోమని హుక్ కి సమాధానం చెప్పాడు న్యూటన్.

అలా ఈ ఇద్దరి మధ్య వాద సంవాదాలు ఎన్నో సంవత్సరాలు నడిచాయి. ఈ మధ్యలో మరొక వ్యక్తి కలిశాడు. ఆయన క్రిస్టియాన్ హైగెన్స్. ఒకప్పుడు ఈయన న్యూటన్ పరిశోధనలను ఆకాశానికి ఎత్తినవాడే. 

కానీ కాంతి కణం అనే భావన దగ్గర సందేహాలను వెలిబుచ్చుతూ రాయల్ సొసైటీకి ఉత్తరమ్రాసాడు. కాంతిని కణం అనే భావనతో న్యూటన్ ఏ లక్షణాలను ప్రతిపాదించి నిరూపించాడో, అవే లక్షణాలను తరంగం అనే భావనతో హైగెన్స్ కూడా నిరూపించగలిగాడు. 

కానీ హుక్, హేగెన్స్ లతో చర్చకి న్యూటన్ ఇష్టపడలేదు. కాంతి తరంగమా, కణమా అన్న ప్రశ్న కి సమాధానంకోసం విజ్ఞాన శాస్త్రం 20వ శతాబ్దం వరకూ వేచి ఉండవలసి వచ్చింది. ఒకవేళ అప్పుడే న్యూటన్ చర్చకు సిద్ధపడి ఉంటే, విజ్ఞానశస్త్రం ఈనాడు వేరే ఎత్తులో ఉండేదేమో. 

న్యూటన్లో ఈఒక్కలక్ష్ణమే కొంచెం వింతగానూ, సరీయినది కానిదిగానూ అనిపిస్తుంది. సిద్ధాంత కర్తలు ఎప్పుడూ, వాదనకి కూడ సిద్ధపడి ఉండలి. అప్పుడే వారి ప్రతిపాదనలలో లోపాలు సదిద్దబడ్, లోకానికి సరైన విజ్ఞానం అందుతుంది.

1689  లో న్యూటన్ జీవితంలో ఓ ముఖ్యమైన పరిణామం జరిగింది. ఆసమయంలో ఇంగ్లండు రాచరికం నుండీ, ప్రజాస్వామ్యం దిశగా నడుస్తోంది. న్యూటన్ పార్లమెంటుకు పోటీ చేసి ఎన్నికయ్యాడు. న్యూటన్ గొప్పదనం  ఆయనకు లభించిన పేరు ప్రఖ్యాతులను చూసి  రాజు చార్లెస్ ఆయనను ఎంతగానో ఆదరించాడు. 

ఆ దేశపు టంకశాల అంటే మింట్ కి అధిపతిగా చేశాడు. టంకశాల అధిపతిగా న్యూటన్ ఎన్నో విపలవాత్మక మార్పులను తెచ్చాడు. నాణాల ఉత్పత్తిని గణనీయంగాపెంచాడు. దానికి ఆయనకు గల అపారమైన యంత్ర విజ్ఞానం ఎంతగానో ఉపయోగపడింది.

టంకశాల అధిపతిగా, న్యూటన్ కఠినంగా వ్యవహరించేవాదు. ఆ సమయంలో  విలియమ్ షాలొనర్ అనే వ్యక్తి దొంగ నాణాలను తయారు చేసేవాడు.  గొప్ప కళాకారుడవ్వవలసిన వ్యక్తి చెడుమార్గంపడితే ఎలాటుందన్న దానికి ఈ షాలొనర్  ఒక ఉదాహరణ. 

ఇతను పాత వాచీలకు అందంగా మెరుగులు దిద్ది, వాతికి రకరకాల ఆకృతులు జోడించి ఎక్కువధరకు అమ్ముకునేవాడు. ఆ వృత్తిలో బాగానే సంపాదించేవాడు. కానీ అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. నకిలీనాణలు తయారుచేసే విద్యను అతను కొంతమంది కళకారులకు లంచం ఇచ్చి నేర్చుకున్నాడు. అచ్చం నిజమైన నాణాలను తలపించే నకిలీ నాణాలను తయారుచేసేవాడు.

అతను నీచుడని తెలిసినా సరైన ఆధారాలు లేకపోవడంతో  చర్యలు తీసుకోలేకపోయేవారు. 

82--

************************************************************

కానీ న్యూటన్ మింట్ అధిపతి అయిన తరువాత అతనిని వదల దలుచుకోలేదు, అతనిపై పటిష్టమైన నిఘాపెట్టి, అతనిస్థావరంపై రాత్రి సమయంలో దాడిచేయించి అధారాలతో సహా బంధించి అతనికి ఉరిశిక్ష విధింపచేశాడు. ఆవిధంగా న్యూటన్ విధినిర్వహణలో ఖచ్చితంగా అంకితభావంతో వ్యవహరించాడు.

1722 నాటికి న్యూటన్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. కీడ్నీరాళ్ళు ఏర్పడి శరీరాన్ని కృంగదీస్తున్నాయి. అతనికి దాదాపు 80 సంవత్సరాల వయసు వచ్చింది.  


రాయల్ సొసైటీ సభల్లో తాత్విక వాదనల్లో తనతో సై అంటే సై అని తలపడిన ఎందరో శాస్త్రజ్ఞులు అప్పటికే ఈలోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.  రాబర్ట్ హూక్,క్రిస్టియాన్ హైగెన్స్ లాంటి న్యూటన్ సమకాలీనులంతా అప్పటికే శాశ్వత విశ్రాంతికి చేరుకున్నారు.

ఆశ్వమేధయాగంచేసి, చుట్టుపక్కల రాజ్యాలన్నిటినీ ఓఢించి సువిశాల సామ్రాజ్యాన్ని  ఏకచత్రధిపత్యంగా ఏలుతున్న వృద్ధ చక్రవర్తిలా జీవిస్తున్నాడు న్యూటన్. తీసుకునే ఆహారం చాలా మితం అయిపోయింది. ఉదయానే కొన్ని నారింజ తొనలు, తియ్యని టీ, రొట్టెలు, వెన్న – ఇదీ బ్రేక్-ఫాస్ట్. 

భోజనంలో ఎక్కువగా ఉడికించిన కూరగాయలు, పళ్ళు తీసుకునేవాడట. అప్పుడప్పుడు కొద్దిగా వైన్ తాగేవాడు. మాంసాహారం మొదట్నుంచీ తక్కువే, తర్వతర్వాత పూర్తిగా మానేశాడు.

1727 మార్చ్ 15నాటికి న్యూటన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, మార్చ్ 20 న ఆ మహా శాస్త్రవేత్త మరణించాడు. 80 సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని గడిపిన న్యూటన్, శాశ్వత నిద్రలోకి చేరుకున్నాడు. అతని మరణం తరువాత ఇంగ్లండు ప్రభుత్వం అతని జ్ఞాపకాలను జాగ్రత్తగా భద్రపరచింది. 

ఆయన నివసించిన ఇల్లు మ్యూజియం గా మారిపోయింది. ఆయన చేతివ్రాతతో కూడిన ఎన్నో ప్రతులను ప్రభుత్వం సం రక్షిస్తోంది. ఎనిమిది దశాబ్దాల అద్భుతమైన జీవతాన్ని  గడిపిన న్యూటన్, ఒక సందర్భంలో తన గురించి తాను ఇలా చెప్పుకున్నాడు - 


 “లోకానికి నేను ఎలా కనిపిస్తానో నాకు తెలియదు. నాకు మాత్రం నేను సముద్ర తీరంలో హాయిగా ఆడుకునే ఓ పిల్లవాణ్ణి మాత్రమే. నా ఎదుట విస్తారమైన విజ్ఞాన సముద్రం ఎగసిపడుతూ వుండగా అప్పుడప్పుడు ఓ మెరిసే రాయినో, గవ్వనో ఏరుకుని వినోదిస్తాను.”

 ఇవి ఫ్రెండ్స్ న్యూటన్ బాల్యానికి, జీవితంలో సాధించిన పలు విజయాలకు సంబంధిచిన విశేషాలు.

83--